News February 2, 2025

పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!

image

నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.

Similar News

News January 15, 2026

చిత్తూరు: మీ ఫ్రెండ్స్‌ను కలిశారా..?

image

చిత్తూరులో ఉంటే జీతం సరిపోదు. తప్పని పరిస్థితుల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ సంక్రాంతికి సొంతూరికి వచ్చేస్తుంటారు. ఈ మూడు నాలుగు రోజులు సరదాగా గడిపేస్తుంటారు. చాలా మంది తమ స్కూల్, కాలేజీ నాటి ఫ్రెండ్స్‌ను ‘గెట్ టూ గెదర్’ పేరిట కలుస్తుంటారు. మరి ఈ సారి మీ ఫ్రెండ్స్‌ను కలిశారా? లేదా కామెంట్ చేయండి.

News January 15, 2026

NZB: మత్తు కలిపి మాయ చేశారు

image

మత్తులో దించి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన కేసులో నిందితులను నిజామాబాద్ టౌన్-4 పోలీసులు అరెస్ చేసి రిమాండ్‌కు తరలించారు. వినాయక్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌కు ముగ్గురు ఓ టీ స్టాల్ వద్ద పరిచమయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఓ హోటల్‌లో శ్రీనివాస్‌ను కలిశారు. బియ్యం వ్యాపారం గురించి మాటల్లోకి దించి <<18857042>>మత్తు<<>> మందు కలిపిన బీరు తాగించారు. బాధితుడు మత్తులోకి జారుకోగానే ఒంటిపై ఉన్న బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.

News January 15, 2026

మన విజయనగరంలో రంజీ మ్యాచ్.. ఎప్పుడంటే?

image

విజయనగరం ఏసీఏ స్టేడియంలో జనవరి 22న రంజీ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. విధర్భ- ఆంధ్ర జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో జిల్లా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇలాంటి మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతుండటంతో విజయనగరానికి ఇది మంచి క్రీడా గుర్తింపు లభించనుంది. స్థానిక యువ క్రికెటర్లకు ఇది ప్రేరణగా నిలిచే అవకాశం ఉంటుందని క్రీడాకారులు అంటున్నారు.