News February 2, 2025

ఇంటర్ ప్రాక్టికల్స్‌ను సజావుగా నిర్వహించాలి : డీఐఈవో

image

ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు నిర్వహించనున్న ప్రాక్టికల్స్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డీఐఈవో జితేందర్ రెడ్డి చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

HYD: హెక్టార్‌లో 2 టన్నుల కంది దిగుబడి

image

గరిష్ఠ ఉష్ణోగ్రతలు తట్టుకొని, ఒక హెక్టార్‌లో 2 టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగడాన్ని ICPV 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 45 డిగ్రీల సెల్సియ ఉష్ణోగ్రతల వద్ద సైతం ఇది తట్టుకుంటుంది. 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఖరీఫ్ రబీ సీజన్‌లో ఎప్పుడైనా పంట పండించవచ్చు. తాండూరు, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంట రకానికి అనుకూలమని అధికారులు డైరెక్టర్ హిమాన్షు తెలిపారు.

News July 5, 2025

TU: CESSలో PHD అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ

image

తెలంగాణ యూనివర్సిటీ సహకారంతో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను PHD అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రొఫెసర్ రేవతి తెలిపారు. ఎకనామిక్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్, పొలిటికల్ సైన్స్, కామర్స్ తదితర విభాగాల్లో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31 చివరి తేదీ అని పేర్కొన్నారు. వివరాలకు https.//cess.ac.in ను సందర్శించాలన్నారు.

News July 5, 2025

అల్లూరి: 90% సబ్సిడీపై 24,000 క్వింటాళ్ల వరి విత్తనాలు

image

అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లో గిరిజన రైతులకు 24,000 క్వింటాళ్ల వరి విత్తనాలను ఖరీఫ్ సీజన్‌లో పంపిణీ చేశామని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.బి.యస్ నంద్ శనివారం తెలిపారు. రాజ్ మా 4500, రాగులు 141, అపరాల విత్తనాలు 364, వేరుశెనగ 648 క్వింటాళ్లు అందజేశామన్నారు. జిల్లాలో దాదాపు 61,000 హెక్టర్లలో వరి పంట సాగు అవుతోందని వెల్లడించారు.