News March 19, 2024
22 నుంచి చంద్రబాబు ‘ప్రజాగళం’ యాత్ర!

AP: ఈ నెల 22 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం’ యాత్ర చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో బాబు పర్యటిస్తారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ఆయన సభలు నిర్వహించనున్నట్లు సమాచారం. అటు త్వరలోనే మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు. ఆ తర్వాత ఈ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారట.
Similar News
News July 8, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: అదే హాట్ టాపిక్!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో TDP మద్దతు కోసం కేటీఆర్ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అక్కడ BRS గెలిచేందుకు టీడీపీ మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు పలువురు హస్తం నేతలు చెబుతున్నారు. ఈ ఆరోపణలను BRS వర్గాలు ఖండిస్తున్నాయి. 2023లో TDP మద్దతు లేకుండానే HYDలో దాదాపు అన్ని సీట్లను గెలిచామని, తమకు ఆ అవసరం లేదని పేర్కొంటున్నాయి.
News July 8, 2025
‘డిగ్రీ’ వద్దంటా..!

TG: డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదు. గత ఐదేళ్లుగా అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ రావడమే ఇందుకు నిదర్శనం. దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియగా ఈ విద్యా సంవత్సరంలో 4.36 లక్షల సీట్లకు 1.41 లక్షల విద్యార్థులే కాలేజీల్లో చేరారు. రాష్ట్రంలోని 957 డిగ్రీ కాలేజీల్లో 64 చోట్ల జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. అదే సమయంలో ఇంజినీరింగ్‌లో చేరే వారి సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
News July 8, 2025
తమిళ రీమేక్ చేయనున్న నాగార్జున?

నాగార్జున ఓ రీమేక్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. శశికుమార్ నటించిన ‘అయోతి’ అనే తమిళ మూవీని నాగ్ రీమేక్ చేయనున్నట్లు టీటౌన్‌లో చర్చ జరుగుతోంది. ఈ మూవీ 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి R.మంతిర మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో ఎమోషన్స్, కథ, కథనం గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని, కమర్షియల్‌గానూ వర్కౌట్ అవుతుందని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.