News February 2, 2025
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల కేటాయింపుపై అనగాని హర్షం

రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు జరిగాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కొత్త ఊపిరి నిచ్చేలా నిధులు కేటాయించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 10, 2025
గుర్తింపు కార్డు ఉంటేనే విశ్వవిద్యాలయంలోకి అనుమతి

AUలో భద్రతతో పాటు అనధికారిక వ్యక్తులను నియంత్రణలో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టింది. విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులు, బోధనేతర సిబ్బంది, బోధనా సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విధులు నిర్వహించే సమయంలో ధరించాలని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. గుర్తింపు కార్డులు ధరించని విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులను, విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి అనుమతించబోమన్నారు.
News November 10, 2025
19న మహిళలకు చీరల పంపిణీ

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.
News November 10, 2025
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు సూసైడ్

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మద్యం మానుకోవడంలేదని పెనుకొండ(M) గుట్టూరులో బిహార్‌కు చెందిన PK రాయ్ భార్య అంజలికుమారి ఉరేసుకుంది. భర్త కియాలో పనిచేస్తాడు. ధర్మవరంలో భవన నిర్మాణ కూలీ శివ(36) మద్యానికి డబ్బులు ఖర్చు చేస్తున్నాడని భార్య నవనీత ప్రశ్నించడంతో ఉరేసుకున్నాడు. మకడశిర(M) మణూరుకు చెందిన మతిస్థిమితం లేని కదురప్ప(46) చెట్టుకు ఉరేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.


