News February 2, 2025
సంగారెడ్డి: ఈనెల 4న భౌతిక రసాయనశాస్త్ర ప్రతిభ పోటీ పరీక్ష

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సైన్స్ మ్యూజియంలో ఈనెల 4న నిర్వహించే బౌతిక రసాయన శాస్త్ర ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించున్నారు. ఈ పోటీలకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆహ్వానిస్తూ జిల్లా బౌతికరసాయన ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నరేందర్లు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఫోరం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News July 7, 2025
వరంగల్: నేడు బల్దియా సమావేశం

గ్రేటర్ వరంగల్ నగర పాలకవర్గం సమావేశం సోమవారం ఉదయం 11.30 గంటలకు జరగనుంది. ఈ మేరకు నగరంలో 66 డివిజన్లలో పెండింగ్లో ఉన్న పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. పాలకవర్గం కాల పరిమితి మరో 10 నెలలు ఉండటంతో పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 23 అంశాలను కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టనున్నారు.
News July 7, 2025
జుక్కల్: మంత్రి వర్యా.. అలంకించండి

జుక్కల్ నియోజకవర్గంలో ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. పిట్లం మండలం హస్నాపూర్ వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, కామారెడ్డి-సంగారెడ్డి అంతర్ జిల్లాల రోడ్డు నిర్మాణానికి పడిన అడుగులు ఆగిపోయాయి. నియోజకవర్గంలో సెంట్రల్ లైటింగ్ పనులు.. ఇలా మరెన్నో సమస్యలు ఉన్నాయి. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏం చేస్తారో చూడాలి.
News July 7, 2025
అనంతగిరి: సీహెచ్ డబ్ల్యూలను ఆశా కార్యకర్తలుగా మార్చాలి

అల్లూరి జిల్లాలో 700 మంది సీహెచ్ డబ్ల్యూలు పనిచేస్తున్నారని, వారందరినీ ఆశా కార్యకర్తలుగా మార్చాలని అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు కోరారు. ఆదివారం అనంతగిరి మండలంలో పర్యటించిన డీఎంహెచ్వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడును ఆయన కలిశారు. సీహెచ్ డబ్ల్యూలను ఆశా కార్యకర్తలుగా మార్చాలని విన్నవించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టులను వెంటనే భర్తీచేయాలని కోరారు.