News February 2, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికలపై అదనపు కలెక్టర్ సమీక్ష

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్స్ హల్ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధిత ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సమావేశం నిర్వహించారు. కరీంనగర్-అదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ, ఉపాధ్యాయ నియోజకవర్గ, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు.
Similar News
News July 5, 2025
HYD: స్వల్పంగా పెరిగిన డెంగీ కేసులు: మంత్రి

హైదరాబాద్లో డెంగీ కేసులు స్వల్పంగా పెరిగాయని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. యాంటిలార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలని, ట్రైబల్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని
మంత్రి సూచించారు.
News July 5, 2025
సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి: కలెక్టర్

కృష్ణా జిల్లాలో సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకార సంస్థలు సమ్మిళితమై స్థిరమైన అభివృద్ధి మార్గాలతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని కలెక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ముందుగా కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, సహకార సంఘాల పతాకాన్ని ఎగురవేశారు.
News July 5, 2025
వరంగల్: అలర్ట్ అయిన ఆర్టీఏ ఏజెంట్లు.. షట్టర్లకు తాళాలు!

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల వార్తలతో వరంగల్ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల్లో ఏజెంట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఏసీబీ అధికారులు తనిఖీలకు వస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా సాగడంతో ఏజెంట్లు షాపుల షట్టర్లకు తాళాలు వేసి ఎక్కడివారక్కడ సైలెంట్ అయ్యారు. ఆర్టీఏ అధికారులతో పాటు ఏజెంట్లు, హోంగార్డులు అక్రమాలకు పాల్పడుతున్నారని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి.