News February 2, 2025

WNP: విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి: కలెక్టర్

image

విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం ఖిల్లా ఘనపురంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల,మండల పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయగా, దొడ్డు బియ్యం వండడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం మాత్రమే వడ్డించాలని అన్నారు.

Similar News

News November 3, 2025

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు అనువైన ప్రదేశాలను గుర్తించండి: కలెక్టర్

image

నంద్యాల పట్టణంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల స్థాపనకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. నంద్యాల పట్టణ పరిధిలో, జాతీయ రహదారుల వెంట, పబ్లిక్ ఉపయోగానికి అనువైన ప్రదేశాలలో 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేయగల స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలన్నారు.

News November 3, 2025

ASF: చేప పిల్లల పంపిణీలో పారదర్శకతకు ప్రాధాన్యం: మంత్రి

image

మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని నీటి వనరులలో చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకాటి శ్రీహరి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్ (ASF) జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చేప పిల్లల పంపిణీ పకడ్బందీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

News November 3, 2025

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ప్రతిమ

image

ఈ నెల 15న నిర్వహించబోయే లోక్ అదాలత్‌పై కోర్టు న్యాయవాదులతో జనగామ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ సోమవారం సమావేశం నిర్వహించారు. సివిల్, మ్యాట్రిమోనియల్, యాక్సిడెంట్, చెక్ బౌన్స్‌తో లాగి పలు కేసుల రాజీ పద్ధతిపై చర్చించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు.