News February 2, 2025
కారుణ్య నియామక పత్రం అందజేసిన ఎస్పీ

బత్తలపల్లిలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతిచెందిన హోంగార్డ్ ఆంజనేయులు కుమారుడు ప్రసన్న కుమార్‌కు కారుణ్య నియామకం పత్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న అందజేశారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ప్రసన్నకుమార్‌కు నియామక పత్రం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. నిబద్ధతతో విధులు నిర్వహించుకోవాలని ఆయనకు సూచించారు.
Similar News
News November 8, 2025
చంద్రుడిపై నీరు, మంచు జాడను కనుగొనడంలో కీలక ముందడుగు!

2019లో చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్-2 తన మిషన్‌ను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్‌లోని ఇస్రో SAC సైంటిస్టులు దాని DFSA రాడార్ నుంచి ఎప్పటికప్పుడు డేటాను విశ్లేషిస్తున్నారు. సుమారు 1,400 రాడార్ డేటాసెట్స్‌ను కలెక్ట్ చేసి ప్రాసెస్ చేశారు. తొలిసారి చంద్రుడి పూర్తి పొలారిమెట్రిక్, L-బ్యాండ్ రాడార్ మ్యాప్‌లను రూపొందించారు. ఇది చంద్రుడి ఉపరితలంపై నీరు, మంచు జాడలను కనుగొనేందుకు దోహదపడనుందని భావిస్తున్నారు.
News November 8, 2025
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన తెలిసిందే. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, శనివారం రాత్రి యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News November 8, 2025
ఖైరతాబాద్: సాగర తీరంలో సీఎం సైకత చిత్రం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో శాండ్ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. ఈ నెల 15వరకు ఈ ఆర్ట్ ఉంటుంది.


