News February 2, 2025
3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్
2025-26లో 2వేల జనరల్ కోచ్‌ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేస్తామని చెప్పారు. మూడేళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్, నాన్ ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త లైన్లు, డబ్లింగ్, ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
Similar News
News February 2, 2025
విద్యార్థులకు GOOD NEWS.. గడువు పొడిగింపు
TG: 2025-26కు గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు <
News February 2, 2025
సండే క్రికెట్ ఫీవర్.. నేడు రెండు మ్యాచ్‌లు
IND క్రికెట్ అభిమానులకు సండే బొనాంజా. ఇవాళ 2 మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. U-19 ఉమెన్స్ WCలో అజేయంగా అదరగొట్టిన భారత్ నేడు ఫైనల్లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. మ.12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక మెన్స్ క్రికెట్లో ENGపై ఇప్పటికే T20 సిరీస్ కైవసం చేసుకున్న సూర్య సేన నేడు చివరి టీ20లో తలపడనుంది. రా.7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. రెండింటినీ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
News February 2, 2025
NPS వాత్సల్య.. రూ.50వేలకు పన్ను మినహాయింపు
బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే <<14158275>>NPS వాత్సల్య పథకంపై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ఏడాది ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90వేల ఖాతాలు ప్రారంభమయ్యాయి. పన్ను ఊరటతో అకౌంట్ల సంఖ్య భారీగా పెరగనుంది.