News February 2, 2025

ASF: భారీగా కలప స్వాధీనం.. ఐదుగురి రిమాండ్

image

మండలంలోని ఆడా గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు అనుమానాస్పదంగా వెళుతున్న కారును ఆపి తనిఖీ చేయగా కలప దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రూ.18 వేల విలువగల 4 టేకు దుంగలను జప్తుచేసినట్లు ఆసిఫాబాద్ FRO గోవింద్ సింగ్ సర్దార్, జోడేఘాట్ FRO జ్ఞానేశ్వర్ తెలిపారు. ఐదుగురుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Similar News

News February 2, 2025

జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం: MP

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి, జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రాఘురాం రెడ్డి అన్నారు. నిన్న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించడంలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నేషనల్ హైవేలు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్‌‌పై ప్రస్తావించలేదన్నారు.

News February 2, 2025

కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

image

కడప ఫాతిమా వైద్య కళాశాలలోని హాస్టల్లో వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మన్సూరీ ఖాన్ (45) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలోకి వెళ్తే.. కాకినాడకు చెందిన మన్సూరీ ఖాన్ భార్య పిల్లలతో రెండేళ్ల క్రితం కడప వలస వెళ్లారు. ఆర్థిక సమస్యలతో హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలను బాగా చూసుకోమని భార్య ఫారియాకు చెప్పాడు. అనంతరం ఉరేసుకుని చనిపోయాడు.

News February 2, 2025

ట్రంప్ మరో కీలక నిర్ణయం

image

కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై టారిఫ్ విధిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కెనడా, మెక్సికో ఇంపోర్ట్స్‌పై 25%, చైనా దిగుమతులపై 10% పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(IEEPA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ వలసలను నిరోధించి దేశ ప్రజలకు మెరుగైన భద్రతను ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.