News February 2, 2025
తాడ్వాయి: భక్తుల స్నానాల కోసం జంపన్న వాగులో షవర్ల ఏర్పాటు

తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి వచ్చే వారి సౌకర్యార్థం వివిధ శాఖలు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. కొద్ది రోజుల్లో మేడారం చిన్న జాతర ఉండడంతో భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జంపన్న వాగులో రెండు ఊట బావులను పూడిక తీసి వాగుకు ఇరువైపుల ఉన్న స్నాన ఘట్టాలకు షవర్లు బిగించారు.
Similar News
News November 4, 2025
పంట నష్ట వివరాలను త్వరగా నమోదు చేయాలి: కలెక్టర్

భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న సహా ఇతర పంటల నష్టపరిహారం వివరాలను త్వరగా నమోదు చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం గ్రామాలలో ఆమె ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లను పరిశీలించారు.
News November 4, 2025
కేజీహెచ్‌లో హీమోడయాలసిస్ యంత్రాల ఏర్పాటు

కేజీహెచ్‌లోని ఎస్ఎస్ బ్లాక్ నెఫ్రాలజీ వార్డులో 9 హీమోడయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఓ కంపెనీ CSR నిధుల నుంచి రూ.2 కోట్లతో ఈ యంత్రాలను కేజీహెచ్‌కు అందించింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బుధవారం నుంచి వీటిని అందుబాటులోకి తేనున్నారు.
News November 4, 2025
ఏటూరునాగారం: అటవీశాఖ సార్లు.. ఇదేం పని..!

ఏటూరునాగారం మండలం కొమురంభీం గుత్తికోయగూడెంలో ఇటీవల అటవీశాఖ అధికారులు ఓ పాఠశాల నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో అటవీశాఖ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పాఠశాల భవనం స్లాబ్ లెవెల్ వచ్చేవరకు బీట్ పరిధి అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని ఆరోపిస్తున్నారు. తీరా పైకప్పు వేసే సమయంలో నిర్మాణం ఆపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ పాఠశాల భవనానికి కలెక్టర్ నిధులు మంజూరు చేశారు.


