News February 2, 2025
మందమర్రి ఏరియాలో 91%బొగ్గు ఉత్పత్తి: GM
మందమర్రి ఏరియాలో జనవరి మాసానికి నిర్దేశించిన లక్ష్యానికి 91% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా GM దేవేందర్ తెలిపారు. శనివారం GMకార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వివరించారు. డిసెంబర్‌తో పోలిస్తే 14,327టన్నుల బొగ్గు ఉత్పత్తి అధికంగా సాధించామన్నారు. అధికారులు, కార్మికులు సమష్టిగా కృషిచేసి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు.
Similar News
News February 2, 2025
మాడుగుల: అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి
మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామంలో అతిగా మద్యం తాగిన జి.మోహన్రావు (48) మృతి చెందాడు. మూడు రోజుల కిందటి నుంచి మోహన్ రావు ఎవరికీ కనిపించలేదు. ఇంట్లో ఉంటాడని భావించిన బంధువులు శనివారం డోర్ తీయగా మృతి చెంది కనిపించాడు. మాడుగుల పోలీస్ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. మోహన్ రావు భార్య, కుమార్తె వద్దకు వెళ్లింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 2, 2025
జనవరిలోనే విద్యుత్ సెగలు.. రికార్డుస్థాయికి చేరిక
చలికాలం ఉండగానే TGలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయికి చేరింది. JAN31న ఏకంగా 15,205 మెగావాట్లుగా(2024లో అదే రోజున 13K) నమోదైంది. ఇక వేసవిలో కరెంట్ డిమాండ్ 17K మెగావాట్లకు చేరుతుందని అధికారుల అంచనా. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 287 మి.యూ అయితే 160-165MU మాత్రమే ఉత్పత్తవుతోంది. మిగతాదంతా కొనుగోళ్ల ద్వారానే సమకూరుతోంది. డిమాండ్ నేపథ్యంలో అధిక ఉత్పత్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News February 2, 2025
జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం: MP
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి, జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రాఘురాం రెడ్డి అన్నారు. నిన్న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించడంలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నేషనల్ హైవేలు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్‌పై ప్రస్తావించలేదన్నారు.