News March 19, 2024
హౌతీల దాడిలో సముద్రంలో మునిగిపోయిన నౌక

హౌతీల దాడిలో యూకేకు చెందిన రూబీమార్ అనే వాణిజ్య నౌక ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న 21,000 మెట్రిక్ టన్నుల ఫెర్టిలైజర్స్ సముద్రం పాలయ్యాయి. దాదాపు 30 కి.మీ మేర సముద్రంపై చమురు తెట్టులా పేరుకుపోయింది. ఈ ఘటనతో అందులోని జీవరాశులకు ముప్పు ఏర్పడుతుందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలకు, పగడపు దిబ్బలకు పర్యావరణ నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు.
Similar News
News August 31, 2025
మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు: MLA గంగుల

TG: BCలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది, ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా అమలైతే తామూ సంతోషిస్తామని BRS MLA గంగుల కమలాకర్ తెలిపారు. ‘మేం BC బిల్లుకు గతంలో మద్దతు ఇచ్చాం. శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అవుతుందని, అశాస్త్రీయంగా వెళ్తే కోర్టులో మొట్టికాయలు పడతాయని చెప్పాం. మా సూచనలను పరిగణనలోకి తీసుకోలేదు. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన వేసిన BC కమిషన్ మాయమైంది’ అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
News August 31, 2025
అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను, పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఎమ్మెల్యేలకు పెన్ డ్రైవ్‌లో అందించింది. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు బండారు రాజిరెడ్డి, బానోతు మదన్ లాల్ మృతి పట్ల సభలో సంతాపం ప్రకటించారు.
News August 31, 2025
‘రామాయణ’ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ అదే: మూవీ టీమ్

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా, KGF ఫేమ్ యశ్ రావణుడిగా ‘రామాయణ’ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. జటాయువు శ్రీరాముడికి సీత జాడ గురించి చెప్పే సన్నివేశంతో ఫస్ట్ పార్ట్ పూర్తవుతుందని, దానికి కొనసాగింపుగా రెండో పార్ట్ ఉంటుందని మూవీ టీమ్ తెలిపింది. జటాయువుకు అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తారని వెల్లడించింది.