News February 2, 2025
CTలో రోహిత్, కోహ్లీలది కీలక పాత్ర: గంభీర్
ఇటీవల ఇంటర్నేషన్ క్రికెట్‌తోపాటు రంజీ ట్రోఫీలోనూ విఫలమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కోచ్ గంభీర్ వెనకేసుకొచ్చారు. వారు డ్రెస్సింగ్ రూమ్‌కే కాకుండా జట్టుకు ఎంతో విలువను చేకూరుస్తారని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్ద పాత్రను పోషించబోతున్నారన్నారు. వారిద్దరికీ పరుగుల దాహం ఉందని, దేశం కోసం ఉత్తమ ప్రదర్శన చేయడానికి ఆరాటపడుతుంటారని పేర్కొన్నారు. CTలో ప్రతి గేమ్ తమకు ముఖ్యమేనని తెలిపారు.
Similar News
News February 2, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
వసంత పంచమి పర్వదినాన్ని ఈ రోజు జరుపుకొంటున్నప్పటికీ రేపు కూడా పంచమి తిథి ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీని ప్రకారం రేపు సెలవు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు. మరి రేపు సెలవు ఉన్నట్లు మీకు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.
News February 2, 2025
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం HYD నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఆయన సాయంత్రం కేంద్ర మంత్రులను కలవనున్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలపనున్నారు. రేపు బీజేపీ అభ్యర్థుల తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. TG CM రేవంత్ సైతం ఢిల్లీలో నేడు, రేపు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
News February 2, 2025
వసంత పంచమి.. బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
TG: వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అక్షరాభ్యాస పూజలకు 2 గంటలు, అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వసతులు సరిగా లేవని పలువురు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.