News February 2, 2025

MNCL: రాష్ట్రస్థాయి పోటీల్లో మెరిసిన జిల్లా విద్యార్థులు

image

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్, ఉపన్యాస పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా విద్యార్థులు ఎం.సంజన, ఎ.అభివర్థిని, ఎస్.అరవిందరాణి ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. శనివారం విద్యార్థులను డీఈఓ యాదయ్య అభినందించారు.

Similar News

News July 9, 2025

WGL: హత్య కేసులో ఇద్దరికీ పదేళ్ల శిక్ష

image

ఉర్సుగుట్ట సమీపంలో మహాలక్ష్మి బేకరీ వద్ద 2022లో వనం రాకేశ్ అనే వ్యక్తిని హత మార్చి, మరుపట్ల నిఖిల్ అనే వ్యక్తిపై హత్యాయత్నం చేసిన శివనగర్‌కు చెందిన గాడుదల రాజేష్, జున్ను హరికృష్ణ@ బంటికి 10 ఏళ్ల కఠిన కారగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున జరిమానాను వరంగల్ కోర్ట్ జడ్జి నిర్మల గీతాంబ విధించారు. ఈ హత్య ఘటనను అప్పటి ఇన్‌స్పెక్టర్ ముస్క శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

News July 9, 2025

NLG: తాడిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

కేతేపల్లి మండలం చీకటిగూడెంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు జానయ్య ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడ్డాడు. ఈ క్రమంలో మోకు మెడకు చుట్టుకోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. జానయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిది పేద కుటుంబమని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతదేహాన్ని నకిరేకల్ మార్చురీకి తరలించారు.

News July 9, 2025

జనసేనలోకి చేరిన నలుగురు జడ్పీటీసీలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నలుగురు జెడ్పీటీసీలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో బుధవారం చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారందరికీ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జంగారెడ్డిగూడెం నుంచి బాబ్జీ , ఆంజనేయులు(తాడేపల్లిగూడెం), అడ్డాల జానకి(అత్తిలి), కొమ్మిశెట్టి రజనీ(పెరవలి) ఉన్నారు.