News March 19, 2024

VZM: 50 ఏళ్ల వయసులో 10వ తరగతి పరీక్షకు హాజరు

image

చదువుకి వయసుతో సంబంధం లేదని గుమ్మలక్ష్మిపురం మండలానికి చెందిన పెద్దమ్మి నిరూపించింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మూలపాడుకి చెందిన 53 ఏళ్ల పెద్దమ్మి సోమవారం పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. 7వ తరగతి వరకు చదివిన ఆమె అనివార్య కారణాలతో చదువు ఆపేశానాని, చదువుపై ఆసక్తితో మళ్లీ పరీక్షలు రాస్తున్నట్టు తెలిపింది. సోమవారం పరీక్ష రాసేందుకు భద్రగిరి ఏపీఆర్ కేంద్రానికి వచ్చారు.

Similar News

News January 25, 2026

అవార్డు అందుకున్న విజయనగరం కలెక్టర్

image

బెస్ట్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ అవార్డుకు విజయనగరం జిల్లా ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో వివేక్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఉత్తమ అవార్డును స్వీకరించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, నూతన విధానాల అమలు వంటి అంశాల్లో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిందని అధికారులు ప్రశంసించారు.

News January 25, 2026

VZM: ఓటే వజ్రాయుధం

image

ప్రజాస్వామ్య భారతానికి ఓటే ప్రాణాధారం. ఓటు కేవలం వేలిపై వేసే గుర్తు కాదు.. అది దేశ తలరాతను మార్చే అస్త్రం. అందుకే పత్రీ పౌరుడూ తన భాద్యతగా ఓటు వేయాలి. ఈ స్పూర్తిని చాటుతూ నేడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఓటు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తారు. కాగా విజయనగరం జిల్లాలో 18-19 ఏళ్ల వయస్సు గల వారిలో కొత్తగా 14,058 మంది పురుషులు, 11,003 మంది మహిళలు కొత్తగా ఓటు హక్కు పొందారు.

News January 25, 2026

ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

image

విజయనగరం జిల్లాలోని దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ శిక్షణ, పోటీ పరీక్షల కోచింగ్ అందిస్తోందని విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, IT/ITES రంగాల్లో ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి కల్పిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థులు apdascac.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.