News February 2, 2025

RC16లో ఓ సీక్వెన్స్‌కు నెగటివ్ రీల్: రత్నవేలు

image

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్, జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆసక్తికర విషయం వెల్లడించారు. ఇందులో ఓ సీక్వెన్స్‌లో సహజత్వం కోసం నెగటివ్ రీల్ ఉపయోగించనున్నట్లు తెలిపారు. కొన్నేళ్లుగా అంతా డిజిటల్ అయిందని, అయితే హాలీవుడ్‌లో నెగటివ్ వాడుతున్నారని చెప్పారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

Similar News

News February 2, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా మారాయి. హైదరాబాద్ నగరంలో స్కిన్ లెస్ కేజీ రేటు రూ.240, విత్ స్కిన్ రూ.220గా ఉంది. అటు ఏపీలోని కాకినాడలో స్కిన్ లెస్ రూ.180 పలుకుతోంది. గత వారం ఇక్కడ ధర రూ.220 ఉండగా, ఇప్పుడు రూ.40 తగ్గింది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.

News February 2, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

వసంత పంచమి పర్వదినాన్ని ఈ రోజు జరుపుకొంటున్నప్పటికీ రేపు కూడా పంచమి తిథి ఉంది. తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. దీని ప్రకారం రేపు సెలవు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఆధారపడి ఉంటుంది. అటు ఏపీలో ఎలాంటి ఆప్షనల్ హాలిడే లేదు. మరి రేపు సెలవు ఉన్నట్లు మీకు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News February 2, 2025

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం HYD నుంచి ఢిల్లీ వెళ్లనున్న ఆయన సాయంత్రం కేంద్ర మంత్రులను కలవనున్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలపనున్నారు. రేపు బీజేపీ అభ్యర్థుల తరఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. TG CM రేవంత్ సైతం ఢిల్లీలో నేడు, రేపు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.