News February 2, 2025
దేశ అప్పు రూ.181 లక్షల కోట్లు

దేశంపై అప్పుల భారం పదేళ్లలో ఏకంగా 192 శాతం పెరిగింది. 2015 మార్చి 31 నాటికి రూ.62 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రూ.181 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో విదేశీ రుణం 6.18 లక్షల కోట్లు, అంతర్గత అప్పు రూ.175 లక్షల కోట్లని తెలిపింది. 2026 మార్చి 31కి మొత్తం అప్పు రూ.196 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది.
Similar News
News February 2, 2026
ఐరన్ లోపం-లక్షణాలు

ఐరన్ లోపం ఉంటే రక్తం తగినంత తయారు కాదు. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో చర్మం పాలిపోయినట్లు తెల్లగా మారుతుందంటున్నారు నిపుణులు. తరచూ చల్లని పదార్థాలను తినాలనిపించడం, నోట్లో అల్సర్లు, శరీరంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడం, కాళ్లు, చేతులు చల్లగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. ఈ వీటిని గుర్తిస్తే ముందుగానే తగిన చికిత్స తీసుకోవచ్చు. దీంతో ఐరన్ లోపం నుంచి బయట పడవచ్చు.
News February 2, 2026
జనవరిలో పెరిగిన GST వసూళ్లు

AP: జనవరి నెలకు సంబంధించి రాష్ట్రంలో రూ.3,073 కోట్ల నికర GST వసూలైంది. గత ఏడాది జనవరితో పోలిస్తే 6.72% పెరిగింది. GST అమల్లోకి వచ్చాక జనవరిలో ఈ స్థాయి ఆదాయం రావడం ఇదే తొలిసారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త ఏడాది, సంక్రాంతి పండుగల వల్ల జరిపిన కొనుగోళ్లతో GST వసూళ్లు పెరిగాయి. జాతీయ స్థాయిలో GST వృద్ధిరేటు 5.8 శాతం ఉండగా, ఏపీలో అంతకంటే ఎక్కువగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.
News February 2, 2026
పీసీబీ ప్రకటనపై స్పందించిన ఐసీసీ

భారత్‌తో T20WC మ్యాచ్‌ను బహిష్కరిస్తామన్న <<19024958>>PCB<<>> ప్రకటనపై ICC స్పందించింది. పీసీబీ నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని పేర్కొంది. ఈ ప్రకటన అంతర్జాతీయ క్రీడా సమగ్రతను దెబ్బతీస్తుందని, పాకిస్థాన్‌లోనూ క్రికెట్‌పై దీర్ఘకాలిక పరిణామాలు ఉండవచ్చని పేర్కొంది. దీనిపై పున:పరిశీలన చేయాలంది. జాతీయ విధానాలను తాము గౌరవిస్తామని, అయితే అందరికీ ఆమోదమైన నిర్ణయాన్ని PCB తీసుకోవాలని ఆకాంక్షించింది.


