News February 2, 2025
కొత్తగూడెం: దివ్యాంగులకు శుభవార్త.. గడువు పొడిగింపు

దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ దరఖాస్తు గడువును ఫిబ్రవరి 12వ తేదీ వరకు పొడిగించారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి జేఎం స్వర్ణలత తెలిపారు. ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీం ద్వారా స్వయం ఉపాధి, పునరావాసం, చేతి వృత్తులు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోడానికి జిల్లాలోని దివ్యాంగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News January 13, 2026
ఇరాన్ నిరసనల్లో 12 వేల మంది చనిపోయారా?

ఇరాన్ నిరసనల్లో 2వేల మంది <<18846903>>చనిపోయారని<<>> వార్తలు వచ్చాయి. కానీ అక్కడి ప్రతిపక్షాలు మాత్రం భద్రతా దళాల కాల్పుల్లో 12వేల మంది చనిపోయారని సంచలన ఆరోపణలు చేశాయి. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద మారణకాండ అని, లెక్కలోకి రాని మరణాలు వందల్లో ఉండొచ్చని Iran International సంస్థ చెప్పింది. ఈనెల 8, 9తేదీల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, బాసిజ్ యూనిట్లు చేసిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయారని తెలిపింది.
News January 13, 2026
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీ సమీక్ష

రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులతో సిపి సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News January 13, 2026
మేడారం జాతరలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీతక్క

మేడారం జాతర నిర్వహణపై అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని మంత్రి సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా టాయిలెట్లను మరింత పెంచాలన్నారు. గురు, శుక్ర వారాల్లోనే ప్రతిరోజు కనీసం 40 లక్షల మంది భక్తులు వస్తున్నారని ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.


