News February 2, 2025
NPS వాత్సల్య.. రూ.50వేలకు పన్ను మినహాయింపు
బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే <<14158275>>NPS వాత్సల్య పథకంపై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ఏడాది ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90వేల ఖాతాలు ప్రారంభమయ్యాయి. పన్ను ఊరటతో అకౌంట్ల సంఖ్య భారీగా పెరగనుంది.
Similar News
News February 2, 2025
బడ్జెట్‌లో ఉద్యోగాల ఊసేది? బ్యాంకర్స్ అసోసియేషన్ నిరాశ
బడ్జెట్ తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది. బడ్జెట్లో ఉద్యోగాల మాటే లేదని.. జాబ్స్ ఇవ్వకుండా ఆర్థికవృద్ధి అసాధ్యమని స్పష్టం చేసింది. దేశ ప్రజలు పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్నారని, పేదరికం పెరుగుతోందని పేర్కొంది. రూపాయి విలువ పడిపోతోందని, ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని వెల్లడించింది. పంటల MSPలపై ప్రస్తావించలేదని విమర్శించింది.
News February 2, 2025
అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు: KTR
TG: ఆకలి చావులు, ఆత్మహత్యల తెలంగాణను KCR తన పదేళ్ల పాలనతో దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టారని KTR అన్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు అన్నపూర్ణ తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైతులు, ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న వార్తలను Xలో పోస్ట్ చేశారు. ‘ఇది ప్రజాపాలన కాదు. ప్రజలను వేధించే పాలన. జాగో తెలంగాణ జాగో’ అని పేర్కొన్నారు.
News February 2, 2025
90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే: సచిన్
విలువలు పాటించే విషయంలో తనకు తన కుటుంబం ఎంతో మద్దతునిచ్చిందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. నమన్ అవార్డ్స్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ’90వ దశకం మధ్యలో రెండేళ్లు నేను బ్యాట్ కాంట్రాక్టు లేకుండా ఆడాను. ఆ సమయంలో ఆల్కహాల్, టొబాకో కంపెనీలు తమ ప్రచారం కోసం బ్యాట్‌లను మాధ్యమంగా వాడుకున్నాయి. అందుకే వాటిని ప్రోత్సహించొద్దని మా ఇంట్లో డిసైడ్ అయ్యాం. 90sలో మేం తీసుకున్న పెద్ద నిర్ణయం అదే’ అని వెల్లడించారు.