News February 2, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు 23 పోలింగ్ కేంద్రాలు: భద్రాద్రి అ.కలెక్టర్
WGL-KMM-NLG టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శనివారం అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1949 మంది ఓటర్లకు 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో పురుషులు 1038, మహిళలు 911 మంది ఉన్నారన్నారు.
Similar News
News February 2, 2025
బాత్రూమ్‌లో బిడ్డను కని చెత్తకుండీలో విసిరేసిన విద్యార్థిని
తమిళనాడులో అమానుష ఘటన జరిగింది. తంజావూర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీ బాత్రూమ్‌లో బిడ్డను ప్రసవించింది. యూట్యూబ్ సాయంతో బొడ్డు పేగు కోసి ఆ పసిప్రాణాన్ని చెత్తకుండీలో విసిరేసి క్లాస్ రూంకు తిరిగొచ్చింది. దుస్తులకు రక్తస్రావాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు లెక్చరర్లకు చెప్పడంతో వారు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బిడ్డను తీసుకొచ్చి బతికించారు.
News February 2, 2025
వనపర్తి: ఈనెల 28 వరకు ‘30 పోలీస్ యాక్ట్ అమలు’: ఎస్పీ
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు “30 పోలీస్ యాక్ట్” అమల్లో ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ ఈ నెల 01 నుంచి 28 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు చేయరాదని తెలిపారు.
News February 2, 2025
కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం
మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.