News February 2, 2025

విద్యార్థులకు GOOD NEWS.. గడువు పొడిగింపు

image

TG: 2025-26కు గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు <>దరఖాస్తు గడువును<<>> ప్రభుత్వం పొడిగించింది. నిన్నటితోనే గడువు ముగియగా, ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు 1,46,394దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5, SC, ST గురుకులాల్లో 6-9, TGSWREIS గౌలిదొడ్డి, అలుగునూరు COEలలో 9, TGTWREIS ఖమ్మం, పరిగి SOEలలో 8th క్లాస్‌కు సీట్లను భర్తీ చేస్తారు.

Similar News

News January 9, 2026

చిరంజీవి సినిమా.. టికెట్ రేట్ల పెంపు

image

AP: చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది. జనవరి 12 నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.120 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.

News January 9, 2026

VIRAL PHOTO: కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇస్తున్న కోహ్లీ!

image

న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నారు. నెట్స్‌లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనను చూడటానికి వచ్చిన అభిమానులకు ఆయన ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. వారిలో ఓ చిన్నారి అచ్చం యంగ్ కోహ్లీలానే కనిపించాడు. దీంతో ‘యంగ్ కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇస్తున్న సీనియర్ కోహ్లీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆదివారం నుంచి NZతో 3 ODIల సిరీస్ ప్రారంభం కానుంది.

News January 9, 2026

కారులో ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

image

సంక్రాంతికి కారులో ఊరెళ్లేవాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకోండి. జర్నీకి ముందురోజే కారు ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. పొద్దున్నే సిటీ అవుట్ స్కట్స్ దాటేయండి. ఫుడ్, ఎక్స్‌ట్రా వాటర్ ఇంటి నుంచే తీసుకెళ్తే మంచిది. దాబాలు, రెస్టారెంట్లలో ఖాళీ ఉండదు. షార్ట్‌కట్లలోనే ట్రాఫిక్ ఎక్కువుండొచ్చు. మెయిన్ రోడ్‌లోనే వెళ్లడం సేఫ్. VJA హైవేలో 6 ఫ్లైఓవర్లు కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. అటు వెళ్లేవారికి కాస్త ఇబ్బంది కలగొచ్చు.