News February 2, 2025
ఏలూరులో రేపటి గ్రీవెన్స్ డే రద్దు

ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ వెట్రి సెల్వి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కోడ్ అమలులో ఉందన్నారు. జిల్లా, డివిజన్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో జరగాల్సిన అన్ని గ్రీవెన్స్ డే కార్యక్రమాలను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు ఎవరూ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి ఏలూరుకు రావద్దని కోరారు.
Similar News
News March 14, 2025
కామారెడ్డి బిడ్డ.. 3 GOVT జాబ్స్ సాధించారు..!

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామానికి చెందిన సంతోష్ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2019లో అటవీ శాఖలో బీట్ అధికారిగా కొలువులో చేరారు. ఆ కొలువు చేస్తూనే.. జేఎల్‌కు సిద్ధమయ్యారు. అంతలోనే గ్రూప్-4 పరీక్ష రాసి.. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ అయ్యారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జేఎల్ సాధించారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోస్టింగ్ వచ్చింది.
News March 14, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు దేబ్ ముఖర్జీ (83) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. అధికార్, జో జీతా వోహీ సికందర్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయన కుమారుడు అయాన్ ముఖర్జీ హిందీ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్-2’ను డైరెక్ట్ చేస్తున్నారు.
News March 14, 2025
హోలీ సందర్భంగా నేడు ప్రజావాణికి సెలవు

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య తెలిపారు. దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి ఈ నెల 18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని దివ్య సూచించారు.