News March 19, 2024

NLG: కొనసాగుతున్న ఇంటర్ మూల్యాంకనం

image

ఇంటర్ మూల్యాంకనం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి NLG ప్రభుత్వ జూ. కళాశాల (బాలుర)లో మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో ముగియనుంది. వివిధ జిల్లాల నుంచి ఐదు లక్షల పేపర్లు మూల్యాంకనం కోసం జిల్లాకు వచ్చాయి. మ్యాథ్స్ 180, ఇంగ్లిష్ 165, తెలుగు 140, సివిక్స్ 75 సంస్కృతం 40, హిందీ సబ్జెక్టు ను ఐదుగురు అధ్యాపకులు మూల్యాంకనం చేస్తున్నారు.

Similar News

News September 5, 2025

NLG: GPOలుగా 276 మంది ఎంపిక

image

జిల్లాలో గ్రామ పాలన అధికారుల నియామకాలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. జిల్లా నుంచి గ్రామ పాలనాధికారులుగా 276 మంది ఎంపికయ్యారు. వీరికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులోని హైటెక్ సిటీలో నియామక పత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 275 క్లస్టర్లలో వీరు నియామకం కానున్నారు. ఇవాళ కానీ రేపు గాని కలెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు.

News September 5, 2025

NLG: చిన్నారి మృతి.. స్కూల్ సీజ్

image

నల్గొండ – దేవరకొండ రోడ్డులోని మాస్టర్ మైండ్ పాఠశాలకు చెందిన విద్యార్థిని జస్మిత స్కూల్ బస్సు కింద పడి చనిపోయిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో బిక్షపతి పాఠశాలను సీజ్ చేశారు. .

News September 5, 2025

NLG: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి టోల్ ఫ్రీ నంబర్

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. సోమవారం నుంచి 18005995991 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ బిల్లుల వివరాలు తెలుసుకునేందుకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.