News February 2, 2025

భూముల రీసర్వే సందేహాలకు ఎక్స్‌ప‌ర్ట్ సెల్: JC

image

భూముల రీస‌ర్వేకు సంబంధించి భూముల య‌జ‌మానుల‌కు వ‌చ్చే సందేహాల‌ను నివృత్తి చేసేందుకు ఎక్స్‌ప‌ర్ట్ సెల్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు జాయింట్ క‌లెక్ట‌ర్ సేతుమాధ‌వ‌న్ శనివారం తెలిపారు. ఎక్స్‌ప‌ర్ట్ సెల్ అధికారిగా స‌ర్వే భూరికార్డుల శాఖ‌కు చెందిన ఏ.మ‌న్మ‌ధ‌రావును నియ‌మించినట్లు పేర్కొన్నారు. ఆయ‌న కార్యాల‌య ప‌నిదినాల్లో ఉద‌యం 10.30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటారన్నారు.

Similar News

News February 2, 2025

ఆండ్ర ఎస్ఐపై విచారణకు ఆదేశం

image

ఆండ్ర ఎస్ఐ సీతారాములు తీరుపై విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ విచారణకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులను ఆయన కలిసినట్లుగా వచ్చిన ఆరోపణలపై బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డిని విచారణ చేసి నివేదిక పంపాలని ఆదేశించామన్నారు. విచారణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ తెలిపారు.

News February 2, 2025

VZM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక తాత్కాలికంగా రద్దు: SP

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8 వరకు జిల్లాలో కోడ్ అమల్లో ఉన్నందున ఫిర్యాదులు స్వీకరించమన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ కోరారు.

News February 1, 2025

VZM: ఎన్నికల కోడ్ అమలుకు నోడల్ అధికారులు

image

జిల్లాలో ఉపాధ్యాయ MLC ఎన్నికల కోడ్ అమలకు నోడ‌ల్ అధికారుల‌ నియ‌మిస్తూ జిల్లా ఎన్నిక‌ల అధికారి అంబేడ్కర్ ఉత్త‌ర్వులు జారీ శనివారం చేశారు. MCC అమ‌లుకు జిల్లా స్థాయి నోడ‌ల్ అధికారిగా ZP CEOస‌త్య‌నారాయ‌ణ నియ‌మితుల‌య్యారు. ఆయ‌న జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లును ప‌ర్య‌వేక్షిస్తారు. ఫిర్యాదుల‌ను స్వీక‌రించి చ‌ర్య‌లు చేప‌డ‌తారు. ఎంపీడీవో, కమీషనర్ల ద్వారా మోడల్ కోడ్ అమలు చేస్తారు.