News February 2, 2025
కారంపూడి: రోడ్డు ప్రమాదంలో మిర్చి వ్యాపారి మృతి

రోడ్డు ప్రమాదంలో మిర్చి వ్యాపారి ఆళ్ల అనిల్ కుమార్ (24)మృతిచెందిన ఘటన కారంపూడి మండలం ఒప్పిచర్ల పెట్రోల్ బంక్ వద్ద శనివారం జరిగింది. మృతుడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పరిధిలోని కండ్రిక గ్రామం గుంటూరులో మిర్చి వ్యాపారం చేస్తూ పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల రైతులను కలిసి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. కారంపూడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 16, 2026
సదర్ మట్ బ్యారేజ్‌ను ప్రారంభించిన సీఎం

మామడ మండలం పొన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ.576 కోట్లతో నిర్మించిన సదర్ మట్ బ్యారేజ్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిమోట్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు.
News January 16, 2026
ఫోర్త్ సిటీలో ఎగిరే టాక్సీలు.. స్కైరైడ్ సిద్ధం!

HYDకు ఎగిరే టాక్సీలు రానున్నాయి. ఫోర్త్ సిటీలో ఈ ‘వర్టిపోర్ట్స్’ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విమానాలకు రన్-వే కావాలి. కానీ ఈ ఎయిర్ టాక్సీలు (eVTOL) హెలికాప్టర్ లాగా నిలువుగాపైకి లేస్తాయి, కిందకు దిగుతాయి. అందుకే వీటికి ఎయిర్‌పోర్ట్ అవసరం లేదు. ఇవి హై స్పీడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ హబ్‌లు కూడా. యాప్‌లో బుక్ చేస్తే ఇంటి మీద ఆగుతాయి. ఫోర్త్ సిటీనుంచి 10MINలో సైలెంట్‌గా ఎయిర్‌పోర్టుకు వెళ్లొచ్చు.