News February 2, 2025
పెద్దగట్టు జాతరకు నిధులు విడుదల
దూరజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరుగుతుంది. నేడు ఆలయం వద్ద దిష్టి పూజ నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. దీంతో పెద్దగట్టు పరిసరాలు కుంభమేళాను తలపిస్తాయి.
Similar News
News February 2, 2025
వనపర్తి: ఈనెల 28 వరకు ‘30 పోలీస్ యాక్ట్ అమలు’: ఎస్పీ
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు “30 పోలీస్ యాక్ట్” అమల్లో ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్ ఈ నెల 01 నుంచి 28 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు చేయరాదని తెలిపారు.
News February 2, 2025
కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం
మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.
News February 2, 2025
తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్
*ప్రషు బేబీ- 11.4 మిలియన్స్
*హర్ష సాయి ఫర్ యూ తెలుగు- 10.9M
*తేజ్ ఇండియా- 5.56 M
*ఫిల్మిమోజి (ఎంటర్‌టైన్‌మెంట్)- 5.31M
*షణ్ముఖ్ జశ్వంత్- 4.93M.
*ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు- 4.73M
*శ్రావణి కిచెన్- 4.7M
*బ్యాంకాక్ పిల్ల- 3.61M
*అమ్మచేతి వంట- 3.52M
*మై విలేజ్ షో- 3.1M
*మీడియాకు మినహాయింపు. ఇవి పర్సనల్ ఛానల్స్.