News February 2, 2025

వసంత పంచమి: ఏం చేయాలి?

image

✒ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఓ పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు వేయాలి. సరస్వతీ దేవి ఫొటోను ఉంచి అలంకరించాలి. పుస్తకాలు, పూలను ముందు పెట్టుకోవాలి.
✒ ఆవు నెయ్యితో 9వత్తులతో దీపాలు వెలిగించాలి.
✒ ఓ గ్లాసు నీటిని ఎడమ చేతిలో పట్టుకుని దానిమీద కుడిచేతిని ఉంచాలి. ఆ తర్వాత ‘ఓం ఐం వాన్యై స్వాహా’ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.
✒ ఆ నీటిని పిల్లల చేత తాగిస్తే దేవి అనుగ్రహం ఉంటుంది.

Similar News

News February 2, 2025

U19 T20 WC ఫైనల్: టీమ్ ఇండియా బౌలింగ్

image

ICC ఉమెన్స్ U19 T20 WC ఫైనల్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: కమలిని, G త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్(C), ఈశ్వరి, మిథిల, ఆయుషి శుక్లా, జోషిత, షబ్నాం, పరుణికా, వైష్ణవి.
SA: జెమ్మా బోథా, లౌరెన్స్, డయారా, ఫే కౌలింగ్, కైలా(C), కరాబో మెసో, మైకే వాన్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా, నిని.
LIVE: హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్

News February 2, 2025

బాత్రూమ్‌లో బిడ్డను కని చెత్తకుండీలో విసిరేసిన విద్యార్థిని

image

తమిళనాడులో అమానుష ఘటన జరిగింది. తంజావూర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీ బాత్రూమ్‌లో బిడ్డను ప్రసవించింది. యూట్యూబ్‌ సాయంతో బొడ్డు పేగు కోసి ఆ పసిప్రాణాన్ని చెత్తకుండీలో విసిరేసి క్లాస్ రూంకు తిరిగొచ్చింది. దుస్తులకు రక్తస్రావాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు లెక్చరర్లకు చెప్పడంతో వారు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బిడ్డను తీసుకొచ్చి బతికించారు.

News February 2, 2025

కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం

image

మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.