News February 2, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. వివరాలు.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్ గుప్త, చిట్కూల్‌కు చెందిన సురేశ్ గుప్త కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్లి స్వగ్రామానికి వస్తున్నారు. శనివారం అర్ధరాత్రి మేడ్చల్ PS పరిధిలో కంటెయినర్‌ను కారు ఢీకొంది. దీంతో డ్రైవర్ నర్సింహా(28), శంకర్ (46), సురేశ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
కాగజ్‌నగర్: పేదలకు అందని కంటి వైద్యం

కాగజ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం కంటి పరీక్షల కోసం సుమారు రూ.5 లక్షల విలువైన కంటి పరీక్ష యంత్రం (ఆప్టోమె ట్రిస్ట్) ఏర్పాటు చేసి వైద్యుడిని నియమించింది. 3 నెలల నుంచి యంత్రం మరమ్మతులో ఉంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కంటివైద్యం అందని ద్రాక్షగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
News November 9, 2025
కామారెడ్డి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి పూట విపరీతమైన చలి ఉండటంతో ప్రజలు బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు పొగ మంచు వల్ల వాహనాలను నడపలేక పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటి నుంచే చలి మంటలు కాచుకుంటున్నారు.
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్‌లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.


