News February 2, 2025

ట్రంప్ మరో కీలక నిర్ణయం

image

కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై టారిఫ్ విధిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కెనడా, మెక్సికో ఇంపోర్ట్స్‌పై 25%, చైనా దిగుమతులపై 10% పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(IEEPA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ వలసలను నిరోధించి దేశ ప్రజలకు మెరుగైన భద్రతను ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Similar News

News February 2, 2025

రాజకీయాల్లోకి ధోనీ? బీసీసీఐ VP ఏమన్నారంటే?

image

భారత మాజీ కెప్టెన్ ధోనీ మంచి రాజకీయ నేత కాగలరని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియదు. వస్తే మాత్రం గెలుస్తారు. ఎందుకంటే ధోనీకి పాపులారిటీ ఎక్కువ. MPగా పోటీ చేస్తున్నావని విన్నాను.. నిజమేనా? అని ఒకసారి అడిగితే పోటీ చేయట్లేదని చెప్పారు. ఆయన ఫేమ్‌కి దూరంగా ఉండాలనుకుంటారు. మొబైల్ ఫోన్ కూడా వాడరు’ అని చెప్పారు.

News February 2, 2025

రామ్‌దేవ్ బాబాపై అరెస్ట్ వారెంట్

image

యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై కేరళలోని ఓ కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలతో రామ్‌దేవ్, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేరళ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణకు రావాలని ఆదేశించినా వారు రాకపోవడంతో కోర్టు తాజా తీర్పునిచ్చింది.

News February 2, 2025

వైరస్: లక్షల సంఖ్యలో కోళ్లు మృతి

image

AP: ఉమ్మడి ప.గో. జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్ DECలో మొదలై JAN నుంచి విజృంభిస్తోందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ భోపాల్ పంపుతున్నారు. 2012, 20లోనూ ఈ వైరస్ వచ్చిందని, ప్రభుత్వం విపత్తుగా పరిగణించాలని కోరుతున్నారు. అటు ఖమ్మం జిల్లాలోనూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి.