News February 2, 2025
కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

కడప ఫాతిమా వైద్య కళాశాలలోని హాస్టల్లో వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మన్సూరీ ఖాన్ (45) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలోకి వెళ్తే.. కాకినాడకు చెందిన మన్సూరీ ఖాన్ భార్య పిల్లలతో రెండేళ్ల క్రితం కడప వలస వెళ్లారు. ఆర్థిక సమస్యలతో హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలను బాగా చూసుకోమని భార్య ఫారియాకు చెప్పాడు. అనంతరం ఉరేసుకుని చనిపోయాడు.
Similar News
News November 15, 2025
పాలమూరు: పీయూలో యాంటీ ర్యాగింగ్ అవగాహన

పాలమూరు విశ్వవిద్యాలయం లైబ్రరీ ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, బీఎఎస్ చట్టంలోని కఠిన సెక్షన్ల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా డి మధుసూదన్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News November 15, 2025
పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.
News November 15, 2025
విశాఖ-కాకినాడ-భీమిలి నుంచి క్రూయిజ్ టూరిజంపై చర్చ

కోర్డెలియా క్రూయిజెస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో కోస్టల్ టూరిజాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఇందుకు కోర్డెలియా క్రూయిజెస్ కలిసి రావాలని సీఎం కోరారు. విశాఖ-కాకినాడ-భీమిలి పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు. క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై కోర్డెలియా క్రూయిజెస్ ఆసక్తి చూపింది.


