News February 2, 2025
GOOD NEWS: వారికి రూ.25,000

TG: మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నదీ పరివాహక ప్రాంతం నుంచి వారిని తరలించేందుకు రవాణా ఖర్చుల నిమిత్తం రూ.37.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులిచ్చారు. 15వేల కుటుంబాలకు రూ.25,000 చొప్పున సాయం చేస్తామన్నారు. HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని అర్హులను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు.
Similar News
News November 12, 2025
మదనపల్లి కిడ్నీ రాకెట్.. నిందితులపై కేసు

APలో సంచలనం సృష్టించిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఆసుపత్రి యజమాని డా.ఆంజనేయులు, మరో వైద్యుడితో పాటు బ్రోకర్లు పద్మ, సత్యలపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసు ఫైల్ చేశారు. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుతో కిడ్నీ రాకెట్ బయటపడింది. పద్మ, సత్య డబ్బు ఆశ చూపి అమాయకులను కిడ్నీ మార్పిడి దందాలోకి దింపుతున్నారు. యమునను కూడా తీసుకొచ్చి కిడ్నీ తొలగిస్తుండగా మరణించింది.
News November 12, 2025
సికింద్రాబాద్‌లోని NIEPMDలో ఉద్యోగాలు

సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<
News November 12, 2025
అయ్యప్ప మాల ఎవరు ధరించకూడదు?

తల్లిదండ్రులు మరణించినప్పుడు పన్నెండు నెలలు సూతకం కారణంగా దీక్షను, యాత్రను విరమించాలి. ఇంట్లో నూతన శిశువు జన్మించినా లేదా స్త్రీలు ఏడో నెల గర్భవతులైనా పురుషులు దీక్ష తీసుకోకూడదు. అనుకోని అశుభాలు సంభవిస్తే దీక్ష విరమించి, తిరిగి దీక్ష చేయాలనుకుంటే 41 రోజులు పూర్తయ్యేలా చూసుకోవాలి. స్త్రీలలో 10 ఏళ్లలోపు బాలికలు, రుతుక్రమం కానివారు, రుతుక్రమం ఆగిపోయినవారు మాత్రమే దీక్షకు అర్హులు. <<-se>>#AyyappaMala<<>>


