News February 2, 2025
కేంద్ర బడ్జెట్లో మరోసారి నెల్లూరు జిల్లాకు నిరాశే
తాజా కేంద్ర బడ్జెట్లో మరోసారి నెల్లూరు జిల్లాకు నిరేశే ఎదురైందని పలువురు పెదవి విరుస్తున్నారు. నడుకుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్, దగదర్తి ఎయిర్ పోర్ట్, రామాయపట్నం పోర్ట్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు కేంద్రం మొండి చెయ్యి చూపించారని వాపోతున్నారు. సువిశాల సముద్ర తీరం ఉన్నప్పటికీ పోర్ట్‌ల విషయంలో జిల్లాకు ఆశించిన నిధులు దక్కలేదని వామపక్షాలు సైతం ఆవేదన వ్యక్తం చేశాయి. దీనిపై మీరేమంటారు.
Similar News
News February 2, 2025
DCMS బిజినెస్ మేనేజర్ వెంకటస్వామి రాజీనామా
జిల్లా కో-ఆపరేటివ్ మార్కింగ్ సొసైటీ (డీసీఎంఎస్) బిజినెస్ మేనేజర్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ కార్తీక్‌కు అందజేశారు. ఔట్సోర్సింగ్ విధానంలో అనేకమంది వద్ద డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్న క్రమంలో ఈ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.
News February 2, 2025
మర్రిపాడు మండలంలో 14 చిరుత పులులు
మర్రిపాడు మండల అటవీ ప్రాంతంలో 14 చిరుతపులులు ఉన్నాయని ఆత్మకూరు అటవీ శాఖ రేంజ్ అధికారి ఆర్.శేఖర్ తెలిపారు. మర్రిపాడు సమీపంలో జాతీయ రహదారిపై చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో చిరుత రోడ్డు దాటే అంతవరకు వాహనాలు నిలిపివేసినట్లు పలువురు తెలిపారు. ఇటీవల ఓ చిరుత సింగనపల్లి వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి మృతి చెందిన విషయం తెలిసిందే.
News February 1, 2025
నెల్లూరు డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మైనార్టీ మహిళ
నెల్లూరు డిప్యూటీ మేయర్ TDP అభ్యర్థిగా 48వ డివిజన్ కార్పొరేటర్, ముస్లిం మైనార్టీకి చెందిన మహిళ తెహసీన్ను ఆ పార్టీ ఎంపిక చేసింది. నగరపాలక సంస్థ చరిత్రలో ముస్లిం మహిళను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఇదే మొదటిసారి. సోమవారం జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో TDP ఆమె పేరును తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెహసీన్కు అభినందనలు తెలిపారు.