News February 2, 2025
మహబూబాబాద్: ఇద్దరిపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్

లైంగిక దాడి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు సీఐ, ఎస్ఐ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తొర్రూరుకి వలస వచ్చారు. ఈక్రమంలో నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్‌తండాకు చెందిన దేశిలావ్ JAN29న లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో బాలికపై లైంగిక దాడికి యత్నించిన కాంస్యతండా వాసి బానోత్ అజయ్‌పై పొక్సో కేసు నమోదవ్వడంతో అరెస్ట్ చేశారు.
Similar News
News November 13, 2025
HYD: ఆస్పత్రికి వెళ్లాలంటే ‘కంటి’ పరీక్ష

సరోజినిదేవి కంటి ఆస్పత్రి.. రోజుకు కనీసం వెయ్యి మంది చికిత్సకు వస్తుంటారు. వీరంతా బస్సు దిగిన తర్వాత (మెహిదీపట్నం వైపు) రోడ్డు దాటాలంటే గుండెలు జారిపోతాయి. వందలాది వాహనాలు రోడ్లపై రయ్ మంటూ దూసుకెళుతుంటాయి. ఆ పరిస్థితుల్లో రోడ్డు దాటడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అసలే కంటి సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తుంటే.. ఈ రోడ్డెలా దాటాలి సారూ అని వాపోతున్నారు. ఓ వంతెన నిర్మించొచ్చు కదా అని కోరుతున్నారు.

HNK: రేపటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థలో రేపటి నుంచి ఈనెల 20 వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ అజీజ్ ఖాన్ తెలిపారు. వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహించి విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు ముగింపు రోజు బహుమతులను అందజేయడం జరుగుతుందని, విద్యార్థులు అధిక సంఖ్యలో వారోత్సవాలకు హాజరుకావాలని ఛైర్మన్ పిలుపునిచ్చారు.