News February 2, 2025
మహబూబాబాద్: ఇద్దరిపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్

లైంగిక దాడి కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు సీఐ, ఎస్ఐ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం తొర్రూరుకి వలస వచ్చారు. ఈక్రమంలో నెల్లికుదురు మండలం హనుమాన్‌నగర్‌తండాకు చెందిన దేశిలావ్ JAN 29న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మరో బాలికపై లైంగిక దాడికి యత్నించిన కాంస్యతండా వాసి బానోత్ అజయ్‌పై పొక్సో కేసు నమోదవ్వడంతో అరెస్ట్ చేశారు.
Similar News
News November 12, 2025
ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. HYDలో హై అలర్ట్

న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది. దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు సికింద్రాబాద్, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.
News November 12, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. కాయ్ రాజా కాయ్..!

ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. HYD, ఉమ్మడి RRలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని మిగితా జిల్లాల్లోనూ గెలుపోటములపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ.వేల నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్‌లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం NOV 14న వెలువడనుంది.
News November 12, 2025
KNR: ఆర్టీఏలో ‘సీక్రెట్ కోడ్’ వసూళ్లు..!

KNR RTA కార్యాలయం దళారులకు దాసోహమంటోంది. అధికారులు, దళారులు సీక్రెట్ కోడ్ ఏర్పాటుచేసుకుని అక్రమ దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలోస్తున్నాయి. వాహనదారులు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన డాక్యుమెంట్స్‌పై కోడ్ ఉంటేనే పనులు జరుగుతున్నాయట. ఉమ్మడిజిల్లాలో ప్రతిరోజు 450వరకు స్లాట్స్ బుక్ అవుతుండగా ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్ బదిలీలను ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. సాయంత్రం 6 దాటాక డబ్బుల పంపకాలు జరుగుతున్నట్లు సమాచారం.


