News February 2, 2025
అనంత: 86 లఘు చిత్రాలు 18 విభాగాలలో పోటీ

అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా 86 లఘు చిత్రాలు 18 విభాగాలలో పోటీ పడుతున్నాయని డైరెక్టర్ రషీద్ బాషా తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో పాల్గొన్న లఘు చిత్రాలను జ్యూరీ సభ్యులు చూసి అవార్డులకు ఎంపిక చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఫిల్మ్ సొసైటీ సభ్యులు తోట బాలన్న, యాంకర్ రమేశ్, గోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 19, 2025
‘రబీలో 1,07,503 హెక్టార్లు సాగులోకి రావొచ్చు’

రబీలో 1,07,503 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావొచ్చని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పప్పుశనగ 65,017 హెక్టార్లు, నీటి వసతి కింద వేరుశనగ 17,982 హెక్టార్లు, మొక్కజొన్న 7888 హెక్టార్లు, వరి 6069, జొన్న 4919, ఉలవ 1377, పొద్దుతిరుగుడు 1230 హెక్టార్లలో సాగులోకి రావొచ్చన్నారు. గతేడాది రబీలో సాధారణ సాగు 1.18 లక్షల హెక్టార్లతో పోల్చితే ఈ ఏడాది 11 హెక్టార్లు తగ్గవచ్చన్నారు.
News October 19, 2025
గుంతకల్లు: రైళ్లకు అదనపు బోగీలు జోడింపు

దీపావళి పండగ సందర్భంగా ప్రయాణాల రద్దీ దృష్ట్యా అనంతపురం రైల్వే స్టేషన్ మీదుగా పలు రైళ్లకు అదనపు బోగీలు జోడిస్తున్నట్లు గుంతకల్లు డివిజన్ అధికారులు తెలిపారు. కలబుర్గి – బెంగళూరు రైలు 06208 అక్టోబర్ 21న, ఫర్నగర్బెం – గలూరు రైలు 06262 అక్టోబర్ 24న గుంతకల్లు మీదుగా అదనపు బోగీలతో నడుస్తుందని వివరించారు.
News October 19, 2025
యాడికి: మహిళపై అత్యాచార యత్నం.. 11 మందిపై కేసు

యాడికి మండలానికి చెందిన మహిళపై ఈనెల 4న అదే మండలానికి చెందిన విశ్వనాథ్ ఆత్యాచార యత్నం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. 8న విశ్వనాథ్ తన సోదరులు, బంధువులతో బాధితురాలి ఇంటిపై దాడి చేసినట్లు ఆరోపించారు. దాడిలో బాధితురాలి భర్త నారాయణస్వామి, కొడుకు నవీన్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది. ఫిర్యాదు చేసినా కేసు నమోదు కాలేని, శనివారం డీఐజీని ఆశ్రయించడంతో పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారన్నారు.