News March 19, 2024
HYD: ‘ఎన్నికల ప్రచారం.. అనుమతి తప్పనిసరి’

ఎన్నికల ప్రచారం కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాల్సి ఉంటుందని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, మాన్యువల్‌గా అనుమతులు ఇవ్వమని కమిషనర్ స్పష్టం చేశారు. 10PM నుంచి 6AM లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దన్నారు.
SHARE IT
Similar News
News September 9, 2025
ఘట్‌కేసర్‌లో దారుణం.. ప్రశ్నించినందుకు చంపాడు

ఘట్‌కేసర్‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాలు.. బోయిగూడకు చెందిన భాస్కర్(27) పనికోసం వచ్చి స్థానిక అంబేడ్కర్ నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అక్కడే ఉండే మణిదీప్ ఆదివారం రాత్రి భాస్కర్‌తో గొడవ పడ్డాడు. అనవసరంగా ఎందుకు గొడవ పడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో మణిదీప్ ఇంట్లోంచి కత్తి తెచ్చి దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డ భాస్కర్.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు.
News September 9, 2025
ఓయూలో నిపుణులను తయారు చేయడమే లక్ష్యం: వీసీ

విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేసే నిపుణులుగా తీర్చిదిద్దడమే AI, ML& డేటా అనలిటిక్స్‌లోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం లక్ష్యమని ఓయూ వీసీ ప్రొ. కుమార్ మోలుగరం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంజినీరింగ్ కళాశాలకు అభినందించారు. సర్టిఫికేషన్ కోర్సులు, వర్క్‌షాప్‌లు నిర్వహించి మరింత ప్రాక్టికల్ నైపుణ్యాలు అందిస్తామన్నారు. ఇందులో ఏఐ లింక్ బృందం కీలకపాత్ర పోషించిందని ప్రశంసించారు.
News September 9, 2025
HYD: మోత మోగిన కరెంట్ బిల్లు.. హీటర్ కారణమే

గ్రేటర్ HYD పరిధి తార్నాక, మల్లాపూర్, ఉప్పల్, చాంద్రాయణగుట్ట సహా అనేక ప్రాంతాల్లో వాటర్ హీటర్లతో మీటర్ల రీడింగ్‌లు గిర్రుమని తిరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో కరెంటు బిల్లు రాగా, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకం ఉన్నవారికి 200 యూనిట్లు దాటింది. దీంతో కరెంటు బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి. పలువురికి రీడింగ్ ఎక్కువగా రావటానికి కారణాలు పరిశీలిస్తే, అనేక మంది అత్యధికంగా వాటర్ హీటర్లు వాడినట్లు తేలింది.