News February 2, 2025
నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం
వేర్వేరు ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. కొండనాగులకు చెందిన జోగు మల్లయ్య(45), తిమ్మాజిపేట మండలం ఆవంచలో సత్తయ్య(42)లు ఇంట్లో చెప్పకుండా.. వారి వారి గ్రామ సమీపాల్లోని కుంటల్లో చేపలవేటకు వెళ్లారు. వారు ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. రెండురోజుల అనంతరం ఇద్దరూ ఆయా కుంటల్లో శవాలై ఆ ఊర్ల వారికి కనిపించారు. ఈ ఘటనలపై కేసునమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 2, 2025
MBNR: పరీక్షల షెడ్యూల్ విడుదల
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (B.PEd) మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష హాలులోకి తప్పనిసరిగా హాల్ టికెట్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని తెలిపారు.
News February 2, 2025
నారాయణపేట జిల్లాలో భారీ మొసలి కలకలం
నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామ సమీపంలో ఉన్న పొలంలో ఉదయం మొసలి కలకలం రేపింది. గ్రామ రైతు పొలంలో వెళ్తుండగా ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. పొలం మధ్యలో మొసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
News February 2, 2025
జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!
జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ <<15332056>>రిజర్వాయర్‌లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.