News February 2, 2025
జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం: MP

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి, జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రాఘురాం రెడ్డి అన్నారు. నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించడంలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నేషనల్ హైవేలు, కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌పై ప్రస్తావించలేదన్నారు.
Similar News
News November 7, 2025
హనుమకొండ: MURDER అటెంప్ట్ కేసు.. టీచర్‌కు జైలు

ఉపాధ్యాయుడికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ముల్కనూర్ ఎస్ఐ రాజు తెలిపిన వివరాలు.. హసన్‌పర్తి(M) నాగారానికి చెందిన బానును హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న స్టాలిన్ ఇటీవల హత్య చేసేందుకు యత్నించాడు. బాను ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరిపి, స్టాలిన్‌ను కోర్టు ఎదుట హాజరు పరిచారు. శుక్రవారం అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా జైలుకు తరలించారు.
News November 7, 2025
MP అకౌంట్ నుంచి ₹56 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

TMC MP కళ్యాణ్ బెనర్జీ బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు ₹56L మాయం చేశారు. బెనర్జీ MLAగా ఉన్నప్పుడు కోల్‌కతాలోని SBI హైకోర్టు బ్రాంచిలో తీసిన అకౌంట్ చాలాకాలంగా ఇనాక్టివ్‌గా ఉంది. ఇటీవల నేరగాళ్లు మార్ఫ్డ్ పత్రాలు, ఫొటోలతో KYCలో ఫోన్ నంబర్ మార్చి డబ్బు మాయం చేశారు. MP ఫిర్యాదుతో అధికారులు కేసు పెట్టారు. ‘బ్యాంకులో ఉంచితే క్రిమినల్స్, ఇంట్లో ఉంచితే మోదీ తీసుకుంటారు’ అని బెనర్జీ విమర్శించారు.
News November 7, 2025
నూతనకల్: యాక్సిడెంట్లో ఒకరు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నూతనకల్ మండల పరిధిలోని ఎర్రపహాడ్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగింది. పెదనేమిల గ్రామానికి చెందిన కాసోజు మురళి, జంగం లాజర్ పోలుమల్ల నుంచి బైక్‌పై పెదనేమిల వెళ్తుండగా జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మురళీ, లాజర్ తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్‌కు తరలించగా మురళి మృతి చెందాడు.


