News February 2, 2025
మాడుగుల: అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి

మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామంలో అతిగా మద్యం తాగిన జి.మోహన్రావు (48) మృతి చెందాడు. మూడు రోజుల కిందటి నుంచి మోహన్ రావు ఎవరికీ కనిపించలేదు. ఇంట్లో ఉంటాడని భావించిన బంధువులు శనివారం డోర్ తీయగా మృతి చెంది కనిపించాడు. మాడుగుల పోలీస్ స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. మోహన్ రావు భార్య, కుమార్తె వద్దకు వెళ్లింది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 30, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 12వ స్థానంలో వనపర్తి

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వనపర్తి జిల్లా 12వ స్థానంలో నిలిచింది. జిల్లాకు 6,500 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే 50 శాతం పనులు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. అయితే, గతంలోనే బేస్మెంట్ వరకు నిర్మించుకున్న 1,308 మంది పేదలకు మొదటి విడతలో నిధులు మంజూరు కాలేదు. వీరి జాబితా ప్రభుత్వం వద్దే ఉందని, వెంటనే ఆ ఇళ్లను మంజూరు చేయాలని పానుగల్కు చెందిన లబ్ధిదారులు కోరుతున్నారు.
News December 30, 2025
కామారెడ్డి: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటును మరో రెండు నెలల పాటు పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారిణి తిరుమల మంగళవారం తెలిపారు. అర్హులైన జిల్లా మీడియా ప్రతినిధులు డిసెంబర్ 31న మధ్యాహ్నం 2 గంటలకు డీపీఆర్ఓ కార్యాలయంలో తమ కార్డులపై పొడిగింపు స్టిక్కర్లను వేయించుకోవాలని ఆమె సూచించారు.
News December 30, 2025
NZB: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు మరో 2 నెలలు పొడిగింపు

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ I&PR ప్రత్యేక కమిషనర్ సీహెచ్. ప్రియాంక మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31తో ముగియనున్న కార్డుల గడువును జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. త్వరలో కొత్త అక్రిడిటేషన్ కార్డుల కోసం ఆన్లైన్ దరఖాస్తుల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


