News February 2, 2025
చనిపోయే ముందు తణుకు ఎస్ఐ చాటింగ్..?

తణుకు ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూం వద్ద ఆయన గన్‌తో కాల్చుకున్నారు. సూసైడ్ చేసుకునే ముందే ఆయన ఫోనులో ఎవరితోనో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత దృశ్యాలు స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్ఐ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ చాటింగ్ బయట పెడితేనే వాస్తవాలు వెల్లడవుతాయని బంధువులు అంటున్నారు.
Similar News
News March 26, 2026
పొట్టేళ్లకు ఎండు మేత చాలా ముఖ్యం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.
News March 26, 2026
PDPL: అడ్డదారిలో పోస్టింగ్లు.. ఎంక్వైరీకి ఆదేశం..!

సింగరేణి కారుణ్య నియామకాల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ACB, విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు సమాచారం. 2014- 25 మధ్యకాలంలో 15,109 మంది కార్మికులు ఇన్వాలిడేషన్ పొందారు. కార్మికులు ఆరోగ్యంగా ఉన్నా విధులకు అనర్హులుగా గుర్తిస్తూ మెడికల్ ఇన్వాలిడేషన్ ఇవ్వడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఉద్యోగ విరమణ తీసుకోవాల్సినవారు వారసులకు ఉద్యోగాలు కల్పించడంతో ఆర్థిక భారం పడుతుందని గుర్తించింది.
News March 26, 2026
మార్కాపురం ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని అన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడిన ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


