News February 2, 2025
చనిపోయే ముందు తణుకు ఎస్ఐ చాటింగ్..?

తణుకు ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడలేదు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్రూం వద్ద ఆయన గన్‌తో కాల్చుకునే ముందు ఆయన ఫోనులో ఎవరితోనో చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత దృశ్యాలు స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఎస్ఐ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఆ చాటింగ్ బయట పెడితేనే వాస్తవాలు వెల్లడవుతాయని బంధువులు అంటున్నారు. ఆయన స్వగ్రామం కోనసీమ జిల్లా కె.గగవరం
Similar News
News March 1, 2026
అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP: రాష్ట్రవ్యాప్తంగా 5వేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తి స్థాయి వేతనాలు ఇస్తామన్నారు. అమరావతిలో అంగన్వాడీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు వెల్లడించారు. వేతనాల పెంపు డిమాండ్‌నూ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
News March 1, 2026
MBNR: ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

జిల్లా కేంద్రంలో NTR మహిళ డిగ్రీ కళాశాల నందు జరిగిన ఎస్సీ స్టడీ సర్కిల్ (5) నెలల శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష ఆదివారం నాడు ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్ష కు 617 మంది హాజరయ్యారు. వీరిలో మెరిట్ ఆధారంగా 100 మందికి 5 నెలల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో (GROUP1,2,3,&4, SI & PC, RRB, BANKING) ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DD (SCDD)డి.సునీత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు.
News March 1, 2026
కొయ్యూరు: యాక్సిడెంట్.. రెవెన్యూ ఉద్యోగికి గాయాలు

కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాట్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రపాలెం వీఆర్వో సత్యనారాయణ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. సత్యనారాయణ తన కుమారుడుతో కలిసి బైక్‌పై కేడీపేట వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గాయపడిన ఇద్దరిని అంబులెన్సు వాహనంలో కేడీపేట పీహెచ్‌సీకి తరలించారు.


