News February 2, 2025
HYD: రాత్రి చలి వణికిస్తోంది.. మధ్యాహ్నం ఎండ దంచుతోంది

ఫిబ్రవరి తొలివారంలోనే పగటి పూట 35 డిగ్రీలకు దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కరిబిక్కిర అవుతున్నారు. HYDలో గరిష్ఠంగా 34.4 డిగ్రీలు, కనిష్ఠంగా 17.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉంటే ఉదయం హైవేలను పొగమంచు కప్పేస్తూ.. రాత్రి పూట పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు నమోదవుతున్నాయి.
Similar News
News March 13, 2025
HCUకు ఉత్తమ యూనివర్సిటీగా గుర్తింపు

ప్రముఖ యూనివర్సిటీ HCUకు అరుదైన గుర్తింపు లభించింది. లండన్‌కు చెందిన క్యూఎస్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలపై స్టడీ నిర్వహించి ర్యాంకింగ్స్ విడుదల చేసింది. 1700 విశ్వవిద్యాలయాల్లో సర్వే చేయగా ఏడు సబ్జెక్టుల్లో ర్యాంక్ పొందింది. లింగ్విస్టిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, సోషియోలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, బయోలాజికల్ సైన్స్‌లో ఉత్తమ ర్యాంకులను సాధించింది.
News March 13, 2025
HYD: BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.
News March 13, 2025
HYD: హోలీ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు: సీపీ

హోలీ నేపథ్యంలో HYDలో ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 గం. నుంచి శనివారం ఉదయం 6 గం. వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వైన్సులతో సహా.. గ్రేటర్ పరిధిలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలుంటాయని ఆదేశించారు. రోడ్లపై వెళ్లే వారిపై అకారణంగా రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.