News February 2, 2025
కేంద్ర బడ్జెట్‌పై కరీంనగర్ MP ప్రశంసలు

కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్‌కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్‌లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.
Similar News
News September 15, 2025
ADB: సైబర్ వల.. చిక్కితే విలవిల!

సైబర్ మోసగాళ్లు రోజుకో మార్గం ఎంచుకొని అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆఫర్లు, బెట్టింగ్స్, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే డబ్బులిస్తామని, హనీట్రాప్ ఇలా విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నారు. వీరి వలలో చిక్కుకున్న బాధితులు విలవిల్లాడుతున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. గత వారంలో ADB జిల్లాలో 20+ కేసులు నమోదయ్యాయి. ఎవరైనా మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయండి.
SHARE IT
News September 15, 2025
రాజమండ్రి: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం

రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ఓ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులతో సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 15, 2025
అల్లూరి: తుపాకీనే కాదు.. ‘కాటా’ కూడా కంపల్సరీ!

సాధారణంగా పోలీసుల విధుల్లో భాగంగా తుపాకీ తీసుకెళ్తుంటారు. కానీ అల్లూరి జిల్లాలో పోలీసులకు మాత్రం తుపాకీతో అదనపు బరువు ఒకటి తోడైంది. అదే వేయింగ్ మెషీన్. ఎందుకంటారా? ఏజెన్సీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఎప్పటికప్పుడు తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయిని అక్కడికక్కడే తూకం వేయాల్సి వస్తోంది. దీంతో వేయింగ్ మెషీన్ తీసుకెళ్లడం వారికి తప్పనిసరి అయింది.