News February 2, 2025

జనగామ: 23 ప్రాక్టికల్ కేంద్రాలు.. 4,714 మంది విద్యార్థులు

image

రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు జనగామ జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో జనరల్, వోకేషనల్ విద్యార్థులు 4,714 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.  

Similar News

News November 11, 2025

రేపు పీఎమ్ ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

రేపు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 6,770 గృహాలకు 6,600 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న100 గృహల ప్రవేశాలు అన్ని నియోజకవర్గాల్లో రేపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 11, 2025

ఇంటి బేస్‌మెంట్ రోడ్డు కంటే ఎంత ఎత్తు ఉండాలి?

image

ఇంటి బేస్‌మెంట్ ఎత్తు గురించి వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ముఖ్యమైన సలహాలిచ్చారు. ‘ఇంటి బేస్‌మెంట్ తప్పనిసరిగా రహదారి ఎత్తు కంటే కనీసం 3 ఫీట్ ఎత్తులో ఉండాలి. లేకపోతే వర్షాకాలంలో నీరు ఇంట్లోకి వస్తుంది. రహదారి నుంచి వచ్చే ప్రతికూల శక్తులు, కాలుష్యం నేరుగా ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి ఈ నియమం పాటించాలి. ఇంటికి ఆధారం, గౌరవం పెరగడానికి, లోపల శుద్ధి ఉండడానికి ఈ ఎత్తు ఉత్తమం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News November 11, 2025

22,861 మందికి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు: మంత్రి సత్యకుమార్

image

APలో 39L మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. 22,861మందిలో సర్వైకల్, 9,963మందిలో బ్రెస్ట్, 26,639మందిలో నోటి క్యాన్సర్ లక్షణాలను గుర్తించామన్నారు. వీరిని బోధనాస్పత్రుల్లోని ఆంకాలజిస్టులు మరోసారి పరీక్షించి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందిస్తారని చెప్పారు. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, మళ్లీ స్క్రీనింగ్ చేపట్టాలని అధికారులకు సూచించారు.