News February 2, 2025
పాడేరు ఘాట్‌లో ప్రమాదం.. ఒకరి మృతి

అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వంటల మామిడి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. 12వ మైలు, వంటల మామిడి మధ్య మలుపులో చోడవరం నుంచి వస్తున్న బైకును వ్యాను ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఒకరు మృతిచెందగా.. మరొకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బైకు వెళ్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ.. ప్రమాద ధాటికి అది కూడా పగిలిపోయింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 2, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 2, 2026
వనపర్తి: ‘ఆపరేషన్ స్మైల్‌తో బాలకార్మికుల నిర్మూలన’

ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కీలక పాత్ర పోషిస్తామని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ చెప్పారు. 2025 సంవత్సరంలో వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలు గణనీయంగా పురోగతిని సాధించాయని చెప్పారు. జిల్లా యంత్రాంగం, ఆయా శాఖల అధికారులతో కలిసి బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు విశేషంగా కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు.
News January 2, 2026
మన మిలిటరీ స్థావరాలపై పాక్ ఫేక్ ప్రచారం!

పాక్ మరోసారి తన నక్క బుద్ధి చూపించింది. ప్రో పాకిస్థాన్ SM అకౌంట్ల ద్వారా ఫేక్ ప్రచారానికి తెరలేపింది. గతేడాది మే నెలలో యుద్ధం సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌బేస్, బియాస్‌లోని బ్రహ్మోస్ స్థావరంపై దాడి చేసినట్లు ఆయా అకౌంట్లలో పోస్టులు చేశారు. దాడికి ముందు, తర్వాత అంటూ తప్పుడు చిత్రాలను షేర్ చేశారు. కానీ ఆ నిర్మాణాలు ఎప్పటిలానే ఉన్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా స్వతంత్ర నిపుణులు తేల్చారు.


