News February 2, 2025
కొత్తగూడ: పురుగు మందు తాగి ఆత్మహత్య

కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామపంచాయతీ పరిధి బోరింగ్ తండాకు చెందిన భూక్య లింగయ్య (55) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మృతుడు లింగయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామని, ఇంటికి వచ్చిన కొద్ది గంటల వ్యవధిలో కడుపు నొప్పి భరించలేక పురుగు మందు తాగినట్లు తెలిపారు.
Similar News
News March 14, 2025
దోమ: ఒకే ఈతలో రెండు దూడలు..

ఒకే ఈతలో రెండు లేగ దూడలు జన్మించిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాలపల్లి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకన్న ఒక ఆవు ఉంది. ఆ ఆవుకు ఒక లేగ దూడను జన్మనివ్వగా మరి కొద్దిసేపటి తర్వాత మరో లేగ దూడకు జన్మనిచ్చిందని వెంకన్న తెలిపారు. తన ఆవుకు రెండు లేగ దూడలు జన్మించడంపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండు దూడలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని మాజీ సర్పంచ్ వెంకన్న తెలిపారు.
News March 14, 2025
ట్రైన్ హైజాక్: పాక్ ఆరోపణల్ని తిప్పికొట్టిన భారత్

బలూచిస్థాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో విదేశీ జోక్యంపై పాక్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి జన్మస్థానమేదో ప్రపంచం మొత్తానికీ తెలుసని పేర్కొంది. ‘పాక్ నిరాధార ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. వారి అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించడం, వేలెత్తి చూపడం మానేసి అంతర్మథనం చేసుకోవాలి’ అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. BLAకు అఫ్గాన్ సాయం, భారత్పై వైఖరి మారలేదని పాక్ నిన్న ఆరోపించింది.
News March 14, 2025
ఒక్కరోజే రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,100 పెరిగి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 పెరగడంతో రూ.89,780కు చేరింది. అటు వెండి ధర రూ.2,000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,12,000గా ఉంది.