News February 2, 2025
నేడు పుంగనూరుకు రానున్న జనసేన అగ్రనాయకత్వం

సోమల ZP హైస్కూల్‌లో ఇవాళ ‘జనంలోకి జనసేన’ భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతోపాటూ పార్టీ అగ్రనాయకత్వం తరలిరానున్నారు. నాయకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. బహిరంగ సభలో నేతలు ఏం మాట్లాడుతారన్న చర్చ ఆసక్తిగా మారింది. టిడ్కో ఛైర్మన్ అజయ్, తిరుపతి MLA ఆరిని శ్రీనివాస్, ఉ.చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్‌లు హాజరుకానున్నారు.
Similar News
News January 17, 2026
చిత్తూరు నగరంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

చిత్తూరు నగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వివరాల మేరకు.. గుడిపాల (M) 190. రామాపురానికి చెందిన వాసుదేవ నాయుడు గంగాసాగరం వద్ద బైకుపై వస్తూ మలుపు తిరుగుతుండగా.. వెనుక వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News January 17, 2026
చిత్తూరు: సింగిరి గుంట వద్ద రోడ్డు ప్రమాదం.. పరిస్థితి విషమం

చౌడేపల్లె మండలంలోని సింగిరి గుంట వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News January 16, 2026
చిత్తూరు: గొర్రెల మందపై చిరుత దాడి!

పులిచెర్ల మండలం పాలెం పంచాయతీ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందగా మరొక గొర్రెకు తీవ్ర గాయాలయ్యాయి. పాల్యంకు చెందిన కృష్ణయ్య తన 40 గొర్రెలను శుక్రవారం అడవుల్లోకి తోలుకెళ్లాడు. సాయంత్రం చిరుత దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందిందని, మరొక గొర్రెకు గాయాలయ్యాయన్నారు. ఇంకో గొర్రె అదృశ్యమైనట్లు గుర్తించామని రైతు తెలిపారు.


