News February 2, 2025

పాలకొండ: ఇంటర్ విద్యార్థి మృతి

image

హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాల పైనుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 9, 2026

శ్రీకాకుళం జిల్లాలో రూ.135.37 కోట్లతో విద్యుత్ ఆధునీకరణ పనులు

image

శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ ఆధునీకరణ పనులకు రూ 135.37 కోట్లు మంజూరయ్యాయని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఈ నిధులను వినియోగిస్తామన్నారు. రూ. 80 కోట్లతో శ్రీకాకుళంలో 132/23 కేవీ విద్యుత్ ఉపకేంద్రం చిలకపాలెం-అంపోలు మధ్యలో నిర్మిస్తారన్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో త్వరితగతిన విద్యుత్ సరఫరా అవుతుందన్నారు.

News January 9, 2026

కోటబొమ్మాళికి డిగ్రీ కాలేజీ మంజూరు..జిల్లాలో మొత్తం ఎన్నంటే?

image

శ్రీకాకుళం జిల్లాకు విద్యాశాఖ కోటబొమ్మాళిలో నూతనంగా డిగ్రీ కళాశాల మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(అటానమస్), శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, టెక్కలి, పలాస, బారువ, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, తొగరాం, పొందూరు ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలో ఉన్నాయి. కొత్తది మంజూరు కావడంతో జిల్లాలో మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 13కు చేరుకున్నాయి.

News January 9, 2026

రథసప్తమి వేడుకలకు నేడు అంకురార్పణ కార్యక్రమం

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 8 గంటలకు అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.46 నిమిషాల పాటు సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.