News February 2, 2025

నంద్యాలలో పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి

image

పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన నంద్యాలలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ శివారు ప్రాంతంలోని నందమూరి నగర్‌కు చెందిన గౌస్‌కు రోజాకుంట వీధికి చెందిన హరికి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్టాండ్ వద్ద వీరిద్దరూ ఎదురుపడగా హరిపై గౌస్ కత్తితో దాడి చేశాడు. నంద్యాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 2, 2025

ఇండియాకు WC అందించిన గొంగడి త్రిష

image

అండర్-19 ఉమెన్స్ WCలో 19 ఏళ్ల తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం. ఈ WCలో అత్యధిక రన్స్ త్రిషవే. బౌలింగ్‌లోనూ సత్తా చాటి 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ WCలో ఓపెనర్‌గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.

News February 2, 2025

తిరుపతి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

image

తిరుపతి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ మేయర్ ఎన్నికలో అధికార, విపక్షాలు పోటాపోటీగా కాలు దువ్వుతున్నాయి. వైసీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ప్రకటించగా.. ఆయన TDPలోకి మారుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన YCP మరో కార్పొరేటర్ భాస్కర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంది.

News February 2, 2025

నేను కొడితే మాములుగా ఉండదు.. : KCR

image

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ తన ప్రసంగాలతో కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇంతకాలం మౌనం పాటించిన కేసీఆర్ మొన్న(శుక్రవారం) ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జరిగిన సభలో స్పందించారు. నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మాములుగా కాదు గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు అని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్?